![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -157 లో.....నర్మద వేదవతి దగ్గరికి వస్తుంది. ధీరజ్ ప్రేమ గురించి మాట్లాడిందంతా నర్మదకి వేదవతి చెప్తుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి ప్రేమ వస్తుంది. మీ అయన మీ గురించి ఏదో మాట్లాడట కదా అని నర్మద అనగానే.. ప్రేమ సిగ్గుపడుతుంది. ముందు ధీరజ్ అంటే నీకు పడేది కాదు కదా.. ఇప్పుడు బానే ఉంటున్నారని నర్మద, వేదవతి ఇద్దరు కలిసి ప్రేమని అడుగుతారు. అవును ముందు ధీరజ్ ని చూస్తే కోపం వచ్చేది కానీ ధీరజ్ వెరీ సెన్సిటివ్ అని ప్రేమ చెప్తుంది.
ఆ తర్వాత శ్రీవల్లి అన్న మాటలు గుర్తుచేసుకొని సాగర్ బాధపడుతాడు. అప్పుడే తిరుపతి వచ్చి ఏంటని అడుగుతాడు. ఎంత కష్టం చేసిన గుర్తింపులేదని సాగర్ అంటాడు. అప్పుడే రామరాజు వస్తాడు. ఎంట్రా చిన్నోడు అలా మాట్లాడుతున్నాడని అడుగుతాడు. సాగర్ ఏదో సర్ది చెప్పి వెళ్ళిపోతాడు. బావ చిన్నోడిని చూస్తే అచ్చం నిన్ను చుసినట్లే అనిపిస్తుంది. ఆ దైర్యం అంతా నీ పోలికే అని తిరుపతి అనగానే.. అవునురా వాడిని చూస్తే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంటుందని రామరాజు అంటాడు. అయితే ఎందుకు కోప్పడుతావని తిరుపతి అనగానే పిల్లల్ని అలా పెంచితేనే వాళ్ళు భయంతో ఉంటారని రామరాజు అంటాడు.
ఆ తర్వాత నర్మద ట్రైనింగ్ గురించి సాగర్ మావయ్యతో చెప్పేలా లేడని వేదవతి దగ్గరికి వచ్చి మావయ్య తో ట్రైనింగ్ గురించి చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. ప్రేమ కూడా వచ్చి నర్మదతో జాయిన్ అవుతుంది. ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. తను రాగానే అందరూ సైలెంట్ గా ఉంటారు. వెళ్ళగానే మాట్లాడుకుంటారు. రాగానే సైలెంట్ అయిపోతారు.. మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు.. నేను రాగానే ఆగిపోయారు.. మీరు ముగ్గురు ఒకటి నేనే పరాయిదాన్ని అని శ్రీవల్లి అనగానే మేమ్ ఏం మాట్లాడుకోవట్లేదని వాళ్ళు అంటారు. ఆ తర్వాత శ్రీవల్లి చాటు నుండి వాళ్ళ మాటలు వింటుంది. ట్రైనింగ్ గురించా మీరు మాట్లాడుకునేది చెప్తానని శ్రీవల్లి అనుకుంటుంది. తరువాయి భాగం లో వేదవతి నర్మద ట్రైనింగ్ గురించి రామరాజుతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |